Reliance Jio: కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్.. ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఉచితంగా ఓటీటీ సేవలు..!

by Maddikunta Saikiran |
Reliance Jio: కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్.. ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఉచితంగా ఓటీటీ సేవలు..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మన దేశంలో ఓటీటీ సంస్థల(OTT Companies) హవా ఎంతగా నడుస్తుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీల పుణ్యమా అని థియేటర్ల(Theatres)లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమాలను ఓటీటీలోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. కాగా ఓటీటీలో వీక్షించాలంటే మనీ పెట్టి సబ్ స్క్రిప్షన్(Subscription) తీసుకోవాలి. అయితే దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) ఓటీటీ లవర్స్‌ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ల(Prepaid recharge plans)పై ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్(OTT Subscription) అందిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 175 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే సోనీలివ్(Sony Liv), జీ5(Zee 5)తో పాటు 10 ఓటీటీ సర్వీసులను ఫ్రీగా పొందొచ్చు. అలాగే అన్ని నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

రూ. 329 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. సాంగ్స్ వినే వారికి ఈ ప్లాన్‌ బెస్ట్‌ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే జియో సావన్‌ ప్రో(Jio Sawan Pro) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా లభిస్తుంది. ఎటువంటి యాడ్స్ లేకుండా ఇందులో మ్యూజిక్ యాక్సెస్‌ చేసుకోచ్చు.

రూ. 448 ప్లాన్

రూ. 448 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో సోనీలివ్‌, జీ5తో పాటు మరో 10 ఓటీటీ సేవలను పొందొచ్చు. అలాగే డైలీ 3జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

Advertisement

Next Story