EV: ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఆసక్తిగా ఉన్న రిలయన్స్ ఇన్‌ఫ్రా

by S Gopi |
EV: ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఆసక్తిగా ఉన్న రిలయన్స్ ఇన్‌ఫ్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అనీల్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలను తయారు చేసే ప్రణాళికను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యాపారంలో రాణించడంపై సలహా కోసం చైనాకు చెందిన బీవైడీ కంపెనీలో మాజీ భారత ఎగ్జిక్యూటివ్‌ను నియమించింది. ఏడాదికి సుమారు 2.5 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో ఈవీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. భవిష్యత్తులో దీన్ని 7.5 లక్షల యూనిట్లకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందుకు అవసరమైన ఖర్చులపై అధ్యయనానికి కన్సల్టెంట్‌లను కూడా నియమించింది. ఈవీల తయారీతో పాటు 10 గిగావాట్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ప్లాంటును కూడా నిర్మించాలని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత పదేళ్లలో 75 గిగావాట్ అవర్ సామర్థ్యానికి పెంచనుంది. అయితే, గత కొన్నేళ్ల నుంచి అధిక రుణాలు, నిధుల లేమి సమస్యతో పోరాడుతున్న రిలయన్స్ ఇన్‌ఫ్రా ఈవీ ప్రాజెక్ట్ కోసం నిధులు ఎలా సమకూరుస్తారనే అంశంపై కంపెనీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

Advertisement

Next Story

Most Viewed