- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు పొడిగింపు!
ముంబై: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియను పూర్తి చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) గడువును పొడిగించింది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల కోసం ఈ నెల 26న రెండో రౌండ్ వేలాన్ని నిర్వహించాలని రుణ సంస్థలు నిర్ణయించడంతో గడువు పొడిగింపు అనివార్యం అయింది. దాంతో దివాలా ప్రక్రియను పూర్తి చేయడానికి ఏప్రిల్ 16 నుంచి జులై 16 వరకు మూడు నెలల గడువును ఎన్‌సీఎల్‌టీ ఇచ్చింది.
రుణ సంస్థలు రెండో రౌండ్ వేలంలో పాల్గొననున్నట్లు హిందూజా గ్రూపునకు చెందిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, టొరెంట్ ఇన్వెస్ట్‌మెంట్, సింగపూర్‌కు చెందిన ఓక్‌ట్రీ కంపెనీలు స్పష్టం చేశాయి. బిడ్డర్లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి రుణ సంస్థలకు మరింత సమయం అవసరం ఉండటంతో రెండవ రౌండ్ వేలం ఈ నెల 11 నుంచి 26వ తేదీకి మారింది.
రెండవ రౌండ్ పూర్తయిన తర్వాత తదుపరి చర్చలు ఉండొద్దని బిడ్డర్లు ఆశిస్తున్నారు. అనంతరం దివాలా ప్రక్రియ తుదిదశకు చేరుకోవాలని వారు భావిస్తున్నారు. కాగా, రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియను పూర్తి చేసేందుకు గతంలోనే చాలాసార్లు గడువు పొడిగించబడింది. అప్పుల్లో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియ కోసం 2022, డిసెంబర్‌లో వేలం నిర్వహించారు.
అందులో టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అత్యధికంగా రూ.8,640 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. దాని తర్వాత హిందూజా గ్రూప్ అత్యధికంగా రూ.8,150కి బిడ్ దాఖలు చేసింది. దీనిపై రిలయన్స్ కేపిటల్‌కు రుణాలిచ్చిన సంస్థల్లో ఒకటైన విస్ట్రా ఐటీసీఎల్ (ఇండియా) ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. మరోసారి వేలం నిర్వహించేందుకు అనుమతించాలని కోరింది. తద్వారా దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఆస్తులకు మరింత విలువను సమకూర్చుకుంటామని వెల్లడించింది.