RBI: ఆర్‌బీఐకి చేరిన 98 శాతం రూ. 2,000 నోట్లు

by S Gopi |
RBI: ఆర్‌బీఐకి చేరిన 98 శాతం రూ. 2,000 నోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: చలామణిలో ఉన్న 98.04 శాతం రూ. 2,000 నోట్లు బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సోమవారం ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పటికీ రూ. 6,970 కోట్ల విలువైన పెద్ద నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ నోట్లను ఉపసంహరించుకునే సమయానికి వ్యవస్థలో మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఉన్నాయి. 2023, మే నెలలో ఆర్‌బీఐ పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత దశలవారీగా గడువును పొడిగించింది. తొలుత అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకు బ్రాంచుల వద్ద నోట్లను డిపాజిట్ లేదా మార్పిడికి అవకాశం కల్పించగా, ఆ తర్వాత ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద మార్చుకునే ప్రక్రియను కొనసాగిస్తోంది. అంతేకాకుండా ప్రజలు తమ వద్ద పెద్ద నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ ఆఫీస్‌కి పంపించవచ్చు. రూ. 2,000 నోట్లు చలామణిలో లేనప్పటికీ, చట్టబద్దంగా వినియోగంలో ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed