జీడీపీ వృద్ధి గణాంకాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు

by S Gopi |
జీడీపీ వృద్ధి గణాంకాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన భారత జీడీపీ వృద్ధి గణాంకాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, జీడీపీ గణాంకాలు అంతుచిక్కని విధంగా ఉన్నాయన్నారు. 'నేను నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాను. తాజా జీడీపీ గణాంకాలు తనకు అర్థం కాలేదని, అవి అంతుచిక్కట్లేదని' అన్నారు. ప్రభుత్వ ద్రవ్యోల్బణ డేటా 1 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉంటే, వాస్తవ ద్రవ్యోల్బణం 3 శాతం నుంచి 5 శాతం మధ్య ఉంటుంది. ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వృద్ధి చెందుతుంటే, ప్రైవేట్ వినియోగం మాత్రం 3 శాతం వెనుకబడి ఉంది. గత మూడు త్రైమాసికాలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా క్షీణించాయి. భారత్ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, ఎక్కువ ఎఫ్‌డీఐలు ఎందుకు రావడంలేదనే ప్రశ్న ఎదురవుతోందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడులు 2016 ముందుకంటే తక్కువగానే ఉన్నాయని అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story