Post Office: రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే..రూ. 2.14లక్షలు మీ చేతికి.. పోస్టాఫీస్‎లో ఈ స్కీమ్ అదుర్స్

by Vennela |
Post Office: రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే..రూ. 2.14లక్షలు మీ చేతికి.. పోస్టాఫీస్‎లో ఈ స్కీమ్ అదుర్స్
X

Post Office Scheme: నేటి పొదుపు.. రేపటి భవిష్యత్తు. చిన్న మొత్తమైనా సరే పొదుపు తప్పనిసరి అని ఆర్థిక సూత్రాలు మనకు చెబుతున్నాయి. ఇవాళ మనం దాచే రూపాయి రేపు మన అవసరాలకు అండగా నిలుస్తుంది. భవిష్యత్తు ఆలోచన చేసేవారికి పెట్టుబడి అనేది చాలా ముఖ్యం. మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు చేయనవసరం లేదు. చిన్న మొత్తాల్లో ఆదా చేసుకోవచ్చు. మీ ఊర్లోనే మీకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్(Post Office) లో చక్కటి పొదుపు స్కీమ్స్(Savings schemes) ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రోజుకు ఎంతో కొంత చొప్పున సేవ్ చేసుకుంటే.. మీ భవిష్యత్ అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదు. అలాగే కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆధ్వర్యంలో పోస్టల్ శాఖలో మీ డబ్బు చాలా భద్రంగా ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్(Post Office) లో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్(Post Office Recurring Deposit Scheme).ఈ స్కీం లో రోజుకు 100 రూపాయల చొప్పున పొదుపు చేస్తే క్రమేనా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. మీరు ప్రతిరోజు కేవలం 100 రూపాయలు ఆదా చేస్తే.. అది నెలకు 3000 అవుతుంది. ఏడాదికి 36,000వేలు అవుతుంది. ఇలా ఐదేళ్లపాటు ఆదా చేస్తూ పోతే డిపాజిట్ 1,80,000 అవుతుంది. ఈ స్కీం కింద కేంద్రం వార్షిక వడ్డీ రేటు 6.7% అందిస్తుంది. 5ఏళ్లకు మీరు సుమారు 34,097 రూపాయలు వడ్డీలు పొందవచ్చు. అంటే మీరు అధిక వడ్డీతో కలిసి ఐదేళ్లకు 2,14,097వేల రూపాయలు అందుకుంటారు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్(Post Office Recurring Deposit Scheme) లో అత్యవసర సమయాల్లో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. కనీసము 12 వాయిదాలు చెల్లిస్తే.. మీ డిపాజిట్ మొత్తము 50% వరకు లోన్ రూపంలో తీసుకోవచ్చు. అయితే ఈ లోన్ పై వడ్డీ రేటు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే 2శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ లోన్స్ మీరు వాయిదా రూపంలో తిరిగి చెల్లించవచ్చు. అయితే మీరు ఐదేళ్ల తర్వాత కూడా ఈ స్కీంను మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు .మరో ఐదేళ్లకు మీ మొత్తానికి మునపటిలాగే వడ్డీ రేటు కూడా చెల్లిస్తారు. అలాగే పొడిగించుకున్న ఖాతాను మీకు ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇక మీరు తక్కువ సమయంలోనే ఖాతాను క్లోజ్ చేస్తే వడ్డీలో మార్పులు ఉంటాయి. మీ ఖాతాను మూడేళ్ల తర్వాత క్లోజ్ చేయవచ్చు. మెచ్యూరిటీ కి ముందు ఖాతా క్లోజ్ చేస్తే వడ్డీ పొదుపు ఖాతా 40శాతం ప్రకారం చెల్లిస్తారు.

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీము(Post Office RD scheme)లో ప్రతి నెల కొంతలో ఆదా చేసుకోవచ్చు . ఐదేళ్ల టెన్యూర్ తోనే రికరింగ్ డిపాజిట్ స్కీము(Recurring Deposit Scheme) అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని వడ్డీ రేటు 6.70 శాతం గా ఉంది. వడ్డీ రేటును కేంద్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సవరిస్తూ ఉంటుంది . గత ఏడాది ఈ స్కీం వడ్డీరేట్లను కేంద్రం పెంచింది. నెల నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది. కనీసం వంద రూపాయల పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరవచ్చు. 100 రెట్టింపు లెక్కన ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఈ స్కీంలో ఇండివిడ్యువల్ గా లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో ప్రతినెలా 5000 చొప్పున పెట్టుబడి పెడితే.. ప్రస్తుతం వడ్డీ 6.7% ప్రకారము ఐదేళ్లకు 56,830 రూపాయలు వడ్డీ అంటుకుంటారు. వడ్డీతో కలిపి 5 ఏళ్లకు 3,56,830 రూపాయలు మీ చేయికి అందుతుంది. మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తే 10ఏళ్ల మెచ్యూర్ కి 2,54,272 జోడించి మొత్తం రూ. 8,54,272 మీ చేతికి అందుతుంది. కస్టమర్ ప్రతినెలా రూ 10వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే 10ఏళ్లకు రూ.17,08,546 అందుకుంటారు.వడ్డీనే రూ. 5లక్షలకు పైగా మీకు వస్తుంది.

Next Story