పీఎం కిసాన్ రూ. 2000 అకౌంట్లోకి రాలేదా..? అయితే ఇలా చేయండి!

by Harish |   ( Updated:2023-03-09 13:50:46.0  )
పీఎం కిసాన్ రూ. 2000 అకౌంట్లోకి రాలేదా..? అయితే ఇలా చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: సన్న, చిన్న కారు రైతులకు పెట్టుబడి సాయంగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల అకౌంట్లో ఏడాదికి రూ. 6000 లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ అమౌంట్‌ను మూడు విడతలుగా రూ.2000 చొప్పున ఇస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా 12 విడతలు విజయవంతంగా పూర్తయ్యాయి.


ఇటీవల ఫిబ్రవరి 27న పీఎం కిసాన్ 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ఇందులో కొంత మందికి ఇప్పటికి రూ.2000 అకౌంట్లో జమ కాలేదు. అలాంటి వారు ఏ కారణంతో డబ్బులు రాలేదా అని కంగారు పడుతున్నారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను పొందడంలో సమస్యలు ఎదురైన రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఉచిత సలహాలు అందిస్తుంది.


* దీనికోసం రైతులు Pmkisan.gov.in వెబ్‌సైట్ ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

* అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేసి ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

* తర్వాత చెకింగ్ ప్రాసెస్ పూర్తయ్యాక తప్పుగా నమోదు చేయబడిన వివరాలు కనిపిస్తాయి.

* ఒకవేళ వివరాలు తప్పుగా ఉన్నట్లయితే [email protected] ఐడీకి మెయిల్ చేయవచ్చు.

* లేదా Pm కిసాన్ యోజన 155261 లేదా 1800115526 లేదా 01123381092 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

Also Read...

ఆధార్ కార్డులో తప్పులను ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే!

Advertisement

Next Story