Paytm Q2 Results: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన పేటీఎం.. రూ. 928 కోట్ల లాభం వచ్చినట్లు వెల్లడి

by Maddikunta Saikiran |
Paytm Q2 Results: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన పేటీఎం.. రూ. 928 కోట్ల లాభం వచ్చినట్లు వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిన్‌టెక్ కంపెనీ(Fintech Company) పేటీఎం(Paytm) మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్(One 97 Communications) మంగళవారం సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను(Quarterly Results) విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ రూ. 928.3 కోట్ల లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి రూ. 290.5 కోట్ల నష్టాల్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. అలాగే కంపెనీ కార్యకలాపాల ఆదాయం 34.1 శాతం తగ్గి 2,519 కోట్ల నుండి రూ. 1,660 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పేటీఎం సినిమా, ఈవెంట్ల టికెట్ బుకింగ్ వ్యాపారాన్ని జొమాటో(Zomato)కు విక్రయించడం వల్ల రూ.1,345 కోట్ల లాభం వచ్చిందని పేర్కొంది. ఇక ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చే ఆదాయం 9 శాతం పెరిగి రూ. 376 కోట్లుగా నమోదైందని, పేటీఎం బిజినెస్ సర్వీసెస్ నుంచి వచ్చే ఆదాయం 34 శాతం పెరిగి రూ. 981 కోట్లకు చేరుకుందని తెలిపింది. అలాగే కంపెనీ ఖర్చులు 17 శాతం క్షీణించి రూ. 1080 కోట్లకు చేరాయని పేర్కొంది. కాగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ(BSE)లో పేటీఎం షేరు ధర 4.73 శాతం మేర తగ్గి రూ. 692.15 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed