కేజీ బేసిన్‌లో చమురు ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్‌జీసీ

by S Gopi |
కేజీ బేసిన్‌లో చమురు ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్‌జీసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) బంగాళాఖాతంలోని కృష్ణా-గోదావరి బేసిన్ డీప్ సీ ప్రాజెక్ట్ నుంచి చమురును ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. కేజీ డీడబ్ల్యూఎన్ 98/2 బ్లాక్‌లో ఉన్న క్లస్టర్2 ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి మొదలవగా, క్రమంగా దీన్ని పెంచనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ బ్లాక్ రోజుకు 45,000 బ్యారెళ్ల చమురు, కోటి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ చమురు ఉత్పత్తిలో 7 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 7 శాతం ఎక్కువ సామర్థ్యం అందుబాటులో రానుంది. క్లస్టర్-2 చమురు ఉత్పత్తి 2021, నవంబర్ నాటికే ప్రారంభం కావాల్సి ఉండగా, కొవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది.

Advertisement

Next Story