Nitin Gadkari: త్వరలో కొత్త టోల్ విధానంపై ప్రకటన

by S Gopi |   ( Updated:2025-03-19 15:29:06.0  )
Nitin Gadkari: త్వరలో కొత్త టోల్ విధానంపై ప్రకటన
X

దిశ, బిజినెస్ బ్యూరో: జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. కొత్త విధానంలో టోల్ చెల్లింపులపై ప్రజలకు రాయితీలను కూడా ఇస్తామని రాజ్యసభలో అడిగిన ప్రశనకు సమాధానంగా కేంద్ర మంత్రి బదులిచ్చారు. దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోందని, దానికోసం టోల్ ఛార్జీలు తప్పనిసరి మంత్రి తెలిపారు. మంచి రోడ్డు కావాలనుకున్నప్పుడు అందుకు తగిన మొత్తం చెల్లించాలనేది రోడ్డు, రహదారుల శాఖ విధానమని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం దేశంలో నాలుగు లేన్లు, ఆరు లేన్లు అంటూ చాలా పెద్ద రోడ్లు వేస్తోంది. వాటికోసం మార్కెట్ నుంచి నిధులు సేకరిస్తున్నాం. కాబట్టి టోల్ ఛార్జీలు లేకుండా ఈ పనులు చేయలేం. ప్రభుత్వం నాలుగు లేన్ల మీద మాత్రమే టోల్ వసూలు చేస్తున్నాం, రెండు లేన్‌లపై వసూలు చేయట్లేదని వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల తర్వాత కొత్త టోల్ విధానాన్ని ప్రకటిస్తాం. ప్రస్తుతం ఇందులోని సమస్యలను పరిష్కరిస్తాం. ప్రజల్కు తగిన స్థాయిలో రాయితీ కూడా ఉంటుంది. కాగా, 2023-24లో దేశీయంగా మొత్తం టోల్ వసూళ్లు రూ. 64,809.86 కోట్లు వచ్చాయి. ఇది అంతకుముందు ఏడాది కంటే 35 శాతం అధికం.

Read More..

India's Richest MLA : దేశంలోనే సంపన్న ఎమ్మెల్యే దగ్గర రూ.3,400 కోట్ల ఆస్తులు

Next Story