RBI : త్వరలో కొత్త రూ.100, రూ.200 నోట్లు

by M.Rajitha |
RBI : త్వరలో కొత్త రూ.100, రూ.200 నోట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రిజర్వ్ బ్యాంకు(RBI) మరో రెండు కొత్త కరెన్సీ నోట్లు(New Currency Notes) విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. అయితే ఈ కొత్త నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌(Mahathma Gandhi Series)తోనే ఉంటాయని RBI పేర్కొంది. ఇవి అందుబాటులోకి వచ్చినా పాతవి చెల్లుతాయని వెల్లడించింది. ఎన్డీఏ హయాంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ. 2 వేల నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా అదే సమయంలో ఎర్రకోటను కలిగి ఉన్న కొత్త రూ.500 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. అయితే 2023లో రూ.2 వేల నోట్లను కూడాఆ రద్దు చేశారు. ఈ మధ్యకాలంలోనే కొత్త రూ.20, 50, 100, 200 నోట్లను కూడా ఆర్బీఐ తీసుకు వచ్చింది. తాజాగా మరో రెండు కొత్త నోట్లను త్వరలో విడుదల చేయబోతోంది.

Next Story

Most Viewed