Cisco layoffs: ఉద్యోగులకు షాక్.. మరోసారి లేఆఫ్‌కు సిద్ధమైన Cisco

by Harish |   ( Updated:2024-08-10 10:12:05.0  )
Cisco layoffs: ఉద్యోగులకు షాక్.. మరోసారి లేఆఫ్‌కు సిద్ధమైన Cisco
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటిస్తూ ఉద్యోగులకు షాక్‌లు ఇస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం, కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడంతో ఖర్చు తగ్గింపుల్లో భాగంగా టెక్ కంపెనీల నుంచి మొదలుకుని వివిధ పరిశ్రమలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా రూటర్లు, స్విచ్‌ల తయారీలో అగ్రగామిగా ఉన్న నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో(Cisco) త్వరలోనే రెండో దఫా లేఆఫ్ ప్రకటించడానికి సిద్ధమైంది. ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని సమాచారం.

AIలో గణనీయమైన పెట్టుబడులను పెంచడానికి ఉద్యోగులను తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. దీనిలో భాగంగా కంపెనీ ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 4,000 మందిని తొలగించింది. ఇప్పుడు రెండో సారి లేఆఫ్‌కు సిద్ధమైంది. సిస్కో మారుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా 2025 నాటికి AI ఉత్పత్తి ఆర్డర్‌లలో $1 బిలియన్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. జూన్‌లో, కంపెనీ Cohere, Mistral AI, స్కేల్ AI వంటి AI స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడానికి $1 బిలియన్ ఫండ్‌ను ప్రారంభించింది. AI, సైబర్‌ సెక్యూరిటీపై ఫోకస్ పెట్టిన తరుణంలో లేఆఫ్‌లు చేస్తుంది.

సంస్థ మరికొద్ది రోజుల్లో తన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తుంది. దానిలో భాగంగా లేఆఫ్‌ల గురించి కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో, ఇంటెల్ 17,500 మంది ఉద్యోగులను తొలగించింది. డెల్‌ రెండు రౌండ్లలో ఏకంగా 13 వేల మందికి లేఆఫ్ ప్రకటించింది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రారంభం నుంచి 393 టెక్ కంపెనీలలో 126,000 మంది తొలగించబడ్డారు.

Advertisement

Next Story