Coffee Day: కాఫీ డే పై దివాలా చర్యలకు ఆదేశించిన NCLT

by Harish |   ( Updated:2024-08-10 15:15:15.0  )
Coffee Day: కాఫీ డే పై దివాలా చర్యలకు ఆదేశించిన NCLT
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేఫ్ కాఫీ డే పేరుతో రిటైల్‌ చైన్‌ను నిర్వహిస్తున్న దాని మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(CDEL)పై దివాలా చర్యలకు NCLT ఆదేశించింది. ఐడీబీఐ ట్రస్టీ షిప్ సర్వీసెస్ లిమిటెడ్(IDBITSL), కాఫీ డే రూ.228.45 కోట్లు చెల్లించడంలో విఫలం అయిందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ తరువాత ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా మధ్యవర్తిని సైతం ఏర్పాటు చేసింది.

2019లో కాఫీ డే మాతృసంస్థకు చెందిన నాన్‌ కన్వర్ట్‌బుల్‌ డిబెంచర్ల (NCD) కూపన్ల కోసం IDBITSL రూ.100 కోట్లు చెల్లించింది. దీనిలో భాగంగా డిబెంచర్ హోల్డర్‌లకు డిబెంచర్ ట్రస్టీగా నియమించడానికి ఆ సంస్థతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, CDEL సెప్టెంబర్ 2019, జూన్ 2020 మధ్య వివిధ తేదీలలో చెల్లించాల్సిన మొత్తం కూపన్ చెల్లింపులను చెల్లించడంలో ఫెయిల్ అయింది. దీంతో డిబెంచర్ హోల్డర్లందరి తరపున IDBITSL 2020లో కాఫీ డే మాతృసంస్థకు నోటీసులు జారీ చేసి, NCLTని ఆశ్రయించింది. విచారణ అనంతరం తాజాగా కాఫీ డే దివాలా ప్రక్రియకు NCLT ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed