SIP: కోటీశ్వరుల్ని చేసే సిప్..నెలకు రూ. 3వేల పొదుపుతో సాధ్యమే

by Vennela |
SIP: కోటీశ్వరుల్ని చేసే సిప్..నెలకు రూ. 3వేల పొదుపుతో సాధ్యమే
X

దిశ, వెబ్ డెస్క్ : SIP Investment: భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ మెంట్(Investment) చేస్తుండాలి. అప్పుడే ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవించగులుగుతాము. చిన్నమొత్తంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్ పొందవచ్చు. అందుకే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ సిప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.చిన్న వయస్సు నుంచే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే...ఓ వయస్సు వచ్చాక ఎవరి మీద ఆధారపడుకుండా మీ డబ్బులతో మీరు సంతోషంగా జీవించవచ్చు. కేవలం నెలకు రూ. 3000తో మ్యూచువల్ ఫండ్స్ (mutual funds)లో ఇన్వెస్ట్ మెంట్ ప్రారంభించడం ద్వారా మీరు 30ఏళ్ల తర్వాత కోటి రూపాయలకు పైగా మీ చేతికి అందుతాయి.

డబ్బు ఎవరైనా సంపాదిస్తారు. కానీ ఆ డబ్బును సరిగ్గా పొదుపు చేయడం చాలా కష్టం. డబ్బు ఆదా చేయడం వల్ల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే అప్పుడే మీరు భవిష్యత్తులో మంచి రాబడులను పొందవచ్చు. రిటైర్మెంట్ సమయంలో మీ మూలధనంపై మెరుగైన రాబడిని పొందాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్(mutual funds) లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్(mutual funds) లో ఇన్వెస్ట్ పెట్టడం వీలైనంత త్వరగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం చిన్న వయస్సు నుంచే ప్రారంభించాలి. మీ మొదటి ఉద్యోగం పొందిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. నెలకు 3 వేల రూపాయల ఇన్వెస్ట్ తో మీరు మంచి రాబడి పొందవచ్చు. 12శాతం రాబడి ఇచ్చే సిప్(SIP) లో మీరు 30ఏళ్లు పెట్టుబడి పెడితే కోటి రూపాయలపైన రిటర్న్స్ పొందుతారు. నెలకు 3వేల చొప్పున 30ఏళ్లకు మీరు పెట్టుబడి 10లక్షల 80వేలు అవుతుంది. దీనిపై రిటర్న్స్ 95 లక్షలపైనే చేతికి అందుతుంది. అంటే మొత్తం మీరు కోటి రూపాయలపైనే అందుకుంటారు.

మ్యూచువల్ ఫండ్స్(mutual funds) అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే మీరు ఒకేసారి భారీ మొత్తంలో రాబడి పొందుతారు. ఇదే 3వేలకు ప్రతి ఏడాది 10శాతం పెట్టుబడి పెంచితే మరింత లాభం పొందుతార. అంటే నెలకు 3000 రూపాయల ఇన్వెస్ట్ తో ప్రారంభిస్తే వచ్చే ఏడాది 300 పెంచాలి. అంటే 3300 రూపాయలు అవుతుంది. ఇలా ప్రతి ఏడాది 10శాతం పెంచుకుంటూ పోతే మరన్ని లాభాలను చూస్తారు.

నోట్: మ్యూచువల్ ఫండ్స్(mutual funds) లో పెట్టుబడులకు రాబడులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు అనే విషయాన్ని గమనించాలి. మార్కెట్ ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు సరైనది ఎంచుకోవాలి.

Next Story

Most Viewed