మస్క్ మరో సంచలన ప్రకటన.. కార్లలో X యాప్

by Harish |
మస్క్ మరో సంచలన ప్రకటన.. కార్లలో X యాప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెస్లా కార్లకు సంబంధించి ఎలాన్‌మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ యాప్‌ను టెస్లా కార్లలో ఉపయోగించుకునేలా సరికొత్త ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని త్వరలో అందిస్తామని ఆదివారం తెలిపారు. ఒక యూజర్ టెస్లా కార్లలో ఎక్స్ యాప్‌ను పొందుపరచగలరా అని ఎక్స్‌‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మస్క్ ఈ విధంగా బదులిచ్చారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కారు కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ (UI)లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా దీనిని వాడుకోవచ్చిని తెలుస్తుంది.

దీనిపై ఒక యూజర్ ఇది నిజంగా శుభవార్త, పూర్తి-సెల్ఫ్ డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు నా ఐఫోన్‌లో X నోటిఫికేషన్‌లను చదవలేను. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గనక యాప్ నోటిఫికేషన్‌లను చదవచ్చు అని అన్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉండవని అన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా అప్లికేషన్‌ను యాక్టివ్‌గా ఉపయోగించలేరు, టైపింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ఇంజనీరింగ్ సమయం వృధా అని అంటున్నారు.

మస్క్ టెస్లా కార్లలో గ్రోక్ ఏఐని అనుసంధానం చేయాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేశారు. టెస్లా ఫ్లీట్‌లోని గ్రోక్‌ను కూడా మర్చిపోవద్దు అని ఒక యూజర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల, భారతదేశ పర్యటనకు రావాల్సిన మస్క్ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల రాలేకపోయారు, ప్రధాని నరేంద్ర మోడీని కలవాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed