గ్లోబల్ లీడర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్

by srinivas |
గ్లోబల్ లీడర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్
X

ముంబై: భారత్‌కు అవసరమైన అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ) పరిష్కారాలను అందించే దిశగా రిలయన్స్ పనిచేయాలని భావిస్తున్నట్టు సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. గురువారం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి సహా భారత్‌కు ప్రాధాన్యతగా ఉన్న రంగాల్లో ఏఐ పరిష్కారాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొత్త యుగానికి సాంకేతిక సంస్థగా రిలయన్స్ అవతరించిందని, డేటాను ఉపయోగించడంలో ముందంజలో ఉండాలి, ఉత్పాదకత, సామర్థ్యం ముందుకెళ్లేందుకు ఏఐని సాధనంగా మార్చుకోవాలని' ఆయన వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని టాప్-10 వ్యాపార గ్రూపులలో ఒకటిగా ఎదుగుతుందని ముఖేష్ అంబానీ అన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా, ఏఐ అడాప్షన్‌లో రిలయన్స్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed