- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Reliance: ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ డేటా సెంటర్ మొత్తం మూడు గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా. దీని నిర్మాణం జరిగితే దేశీయ డేటా సెంటర్ విభాగంలోనే అతిపెద్ద వ్యూహంగా మారనుంది. ప్రస్తుత గ్లోబల్ సామర్థ్యాలను సులభంగా అధిగమిస్తుంది. దీనికోసం ప్రముఖ ఎన్విడియా నుంచి అధునాతన ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. గ్లోబల్ టెక్ అమెజా, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు ఏఐ టెక్నాలజీ కోసం డేటా సెంటర్ సామర్థ్యాలను విస్తరించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టనున్నాయి. ఇటీవలే ఓపెన్ ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్ సంస్థలు సంయుక్తంగా భారీ ఏఐ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ద్వారా కొత్త లక్ష్యాలను చేరుకోనుంది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం ఒక గిగావాట్ కంటే తక్కువగా ఉంది. రిలయన్స్ కొత్త ప్రాజెక్టుతో భారత డేటా సెంటర్ల సామర్థ్యం మూడు రెట్లు పెరగనుంది. ఇది రిలయన్స్‌తో పాటు భారత టెక్ రంగానికి కీలంగా ఉంటుంది. గతేడాది ద్వితీయార్థంలో రిలయన్స్ సంస్థ ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్ సెంటర్ కోసం ఎన్విడియాతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ ఏఐని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు.