- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GDP: 2024లో భారత జీడీపీ వృద్ధి 7.2 శాతం.. అంచనాలను పెంచిన మూడీస్
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ జీడీపీ వృద్ధి 2024లో 7.2 శాతానికి పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. గతంలో 6.8 శాతంగా అంచనా వేయగా, తాజాగా దానిని సవరించి జీడీపీపై వృద్ధి అంచనాలను మరింత పెంచింది. అలాగే, భారత జీడీపీ వృద్ధి 2025 లో 6.6 శాతానికి వేగంగా వృద్ధి చెందుతుందని తెలిపింది, అంతకుముందు మూడీస్ వృద్ధి అంచనాను 6.4 శాతంగా అంచనా వేసింది. సవరించిన అంచనాలు ప్రైవేట్ వినియోగంలో పెరుగుదలను సూచిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు కొంత వరకు తగ్గుముఖం పట్టడం, అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ప్రపంచ వృద్ధి స్థిరీకరించబడటంతో దీని ప్రభావం భారత్‌పై గణనీయంగా ఉంటుందని మూడీస్ 2024, 2025కి భారత వృద్ధి అంచనాలను వరుసగా 7.2, 6.6 శాతానికి పెంచింది. రేటింగ్ ఏజెన్సీ పేర్కొన్న దాని ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 7.8 శాతంగా నమోదైంది. కఠినమైన ద్రవ్య విధానం, ఆర్థిక ఏకీకరణపై పురోగతి కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది.
పారిశ్రామిక, సేవల రంగాలు రెండూ బలమైన పనితీరును కనబరిచాయి, ముఖ్యంగా సేవల పీఎంఐ సంవత్సరం ప్రారంభం నుండి 60 కంటే ఎక్కువగానే ఉంది. ఆర్‌బీఐ లక్ష్యం మేరకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో గృహ వినియోగం పెరగడానికి సిద్ధంగా ఉందని మూడీస్ పేర్కొంది.
రుతుపవన కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న నేపథ్యంలో వ్యవసాయోత్పత్తికి అవకాశాలు పెరిగాయి, గ్రామీణ డిమాండ్‌లో పునరుద్ధరణ సంకేతాలు వెలువడుతున్నాయి. నాన్‌ఫైనాన్షియల్ కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లు సానుకూలంగా ఉన్నాయి. పెరుగుతున్న సామర్థ్య వినియోగం, వ్యాపార సెంటిమెంట్, ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా భారత జీడీపీ వృద్ధి సానుకూలంగా ఉందని మూడీస్ పేర్కొంది.