- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలర్ట్: ఫిబ్రవరి 1 నుంచి మనీ సంబంధిత మార్పులు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా మనిషి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా అందరూ జాగ్రత్త పడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇవేగాక, మరికొన్ని కీలకమైన ఆర్థిక పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అవేంటంటే?.. రేపు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జట్‌పై వివిధ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 2023-24లో సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం ఏవిధంగా ఉండబోతోందనేది ఫిబ్రవరి 1వ తేదీన తేలనుంది.
= బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 1 శాతం ఛార్జీలను విధించనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానుంది.
= గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలు ఫిబ్రవరి 1న సవరించే అవకాశం ఉంది.
= దేశీయ మార్కెట్లో టాటా మోటార్ కార్ల రేట్లు ఫిబ్రవరి 1 నుంచి మరింత ప్రియమవ్వబోతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయిన కారణంగా కార్ల ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.
= మరోవైపు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డులపై సర్వీసు ఛార్జీలను పెంచుతున్నట్టు వెల్లడించింది. క్లాసిక్ డెబిట్ కార్డ్స్ వార్షిక ఫీజును రూ.125 నుంచి రూ.200 లకు పెంచింది. కార్డులను బట్టి ఛార్జీల పెంపులో వ్యత్యాసం ఉంటుందని, ఈ పెంపు ఫిబ్రవరి 13, 2023 నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది.
ఈ-మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. 'చాలెంజ్ గ్రాండ్ ఫినాలే'