వినియోగదారులకు షాక్ ఇచ్చిన మారుతీ సుజుకి! అన్ని మోడళ్లపై ధరల పెంపు

by Harish |   ( Updated:2023-03-23 13:14:31.0  )
వినియోగదారులకు షాక్ ఇచ్చిన మారుతీ సుజుకి! అన్ని మోడళ్లపై ధరల పెంపు
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణంతో పాటు నియంత్రణా పరమైన నిబంధనలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. సవరించిన ధరలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా, ఎంతమేర పెంపు ఉంటుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మోడల్‌ని బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుందని మాత్రమే పేర్కొంది.

ఖర్చులను తగ్గించేందుకు, కొంతైనా ధరల భారాన్ని భరించేందుకు కంపెనీ ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో కొంత వ్యయ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్టు మారుతీ సుజుకి అధికారిక ప్రకటనలో వివరించింది.

మరోవైపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్6 రెండో దశ ఉద్గార నిబంధనల కారణంగా హోండా కార్స్ ఇండియా తన ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధరను రూ. 12 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. అమేజ్ వివిధ వేరియంట్లను బట్టి ధరల పెరుగుదలలో మార్పు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. మరో మోడల్ సిటీ ధరలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది.

Also Read...

సూపర్ యాప్ కోసం అదనపు నిధులు కేటాయించే పనిలో టాటా గ్రూప్!

Advertisement

Next Story