- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 వేలకు పైగా 'బలెనో' మోడల్ కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి!
X
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీ సంఖ్యలో తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ బలెనో కార్లను రీకాల్ చేసింది. వాక్యూమ్ పంప్‌లో లోపం కారణంగా 7,213 బలెనో ఆర్ఎస్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2016, అక్టోబర్ 27 నుంచి 2019, నవంబర్ 1వ తేదీ మధ్య కాలంలో తయారైన బలెనో ఆర్ఎస్ కార్లలో లోపం ఉన్నట్లు మారుతీ సుజుకి గుర్తించింది. బ్రేక్ వేసేందుకు సహాయపడే వాక్యూమ్ పంప్‌లో లోపం వల్ల కొన్ని సందర్భాల్లో బ్రేక్ వేసేందుకు ప్రయాణీకులు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. లోపం ఉన్నట్లు గుర్తించిన వాహనాలకు సంబంధించి కంపెనీయే స్వయంగా వినియోగదారులను సంప్రదించి ఉచితంగా విడిభాగాలను మార్చనున్నట్టు మారుతీ సుజుకి పేర్కొంది.
Also Read...
Advertisement
Next Story