- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indigo: మహీంద్రా కొత్త ఈవీ కారుకు 'బీఈ6ఈ' పేరు పెట్టడంపై దావా వేసిన ఇండిగో
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ మధ్య వివాదం నెలకొంది. మహీంద్రా ఎలక్ట్రిక్‌పై ఇండిగో సంస్థ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ఇటీవల ఈవీ విభాగంలో మహీంద్రా బీఈ 6ఈ మోడల్‌ను లాంచ్ చేసింది. 2025 ఫిబ్రవరిలో ఈ కారు విడుదల కానుంది. కంపెనీ తన కారుకు '6ఈ' పేరు ఉపయోగించడంపై ఇండిగో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు. దాంతో డిసెంబర్ 9న ఈ వ్యవహారం విచారణకు రానుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మహీంద్రా ఎయిర్‌లైన్‌తో చర్చలు ప్రారంభించినట్లు ఇండిగో తరఫు సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు తెలియజేశారు. తమ 6ఈ బ్రాండింగ్‌ను ఇప్పటికే వివిధ సేవల్లో వాడుతున్నామని, విమాన సేవలతో పాటు 6ఈ ఫ్లెక్స్, 6ఈ లింక్, 6ఈ ప్రైమ్ వంటి సేవలను అందిస్తున్నాం. కానీ మహీంద్రా ఇటీవల లాంచ్ చేసిన బీఈ 6ఈ మోడల్ కోసం 6ఈ పేరు వాడటం అభ్యంతరకరంగా భావిస్తున్నామని ఇండిగో వెల్లడించింది.