- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
L & T Chairmen: L & T చైర్మన్ నోటిదూల.. ఈసారి ఏకంగా శ్రామిక శక్తినే అవమానించారుగా!

దిశ, వెబ్‌డెస్క్: L & T Chairmen: ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్. ఎన్(L & T Chairmen) సుబ్రహ్మణ్యన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండటం వల్లే భారత్ లో కార్మికులు పనిచేసేందుకు ఇష్టపడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు..ఆదివారాలూ పనిచేయండి అంటూ ఈ మధ్యే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు(Labor migration) తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సంక్షేమ పథకాల అమలు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది అన్నారు. వాటి వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు.
చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో పాల్గొన్న ఆయన కార్మికుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. మా సంస్థలో ప్రస్తుతం 2.5లక్షల మంది ఉద్యోగులు, 4లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ ఆ విషయం పెద్దగా బాధించడం లేదు. కానీ కార్మికుల లభ్యత గురించి నేను ఎక్కువగా ఆందోళన చెందాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండవచ్చు. ఇక అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణం అయ్యిండొచ్చు.వాటి వల్లే వారు వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదని సుబ్రహ్మణ్యన్(Subramanian) తెలిపారు.
అయితే కేవలం కార్మికుల్లో మాత్రమే కాదు..వైట్ కాలర్ ఉద్యోగాలు (White-collar jobs)చేస్తున్న వ్రుత్తి నిపుణుల్లోనూ ఇదే భావన ఉందనిపిస్తోందని వ్యాఖ్యానించారు. నేను ఎల్ అండ్ టీ సంస్థలో ఇంజనీర్ గా చేరినప్పుడు మా బాస్ ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా వ్యక్తిని అలా అడిగితే బై అంటూ వెళ్లిపోతారని వివరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ మధ్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్(Work-life balance) పై సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాశంమైన విషయం తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారని..ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90గంటల పాటు పనిచేయాలి. ఆదివారం సెలవునూ వదిలేయాని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్ లోనూ పెను దుమారమే లేపాయి. దీనిపై ఆ తర్వాత కంపెనీ స్పష్టతనిచ్చింది. అభివ్రుద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరం అంటూ తన ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది.