LIC కొత్త పాలసీ: సింగిల్ ప్రీమియంతో జీవిత బీమా ప్లాన్

by Harish |   ( Updated:2023-06-24 03:29:33.0  )
LIC కొత్త పాలసీ: సింగిల్ ప్రీమియంతో జీవిత బీమా ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ కొత్తగా ఒక పాలసీని తీసుకొచ్చింది. దీని పేరు ‘ధన్ వృద్ధి’. ఈ కొత్త పాలసీలో బీమా తీసుకున్న వ్యక్తికి బీమా రక్షణతో పాటు గ్యారెంటీ రాబడి ఉంటుంది. ఇది ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, సింగిల్ ప్రీమియం లైఫ్ ప్లాన్. ఈ పథకాన్ని జూన్ 23న ఎల్‌ఐసీ కొత్తగా ప్రారంభించింది. సెప్టెంబర్ 30, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారు మధ్యలో మరణిస్తే అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తారు. దీంతో పాటు మెచ్యూరిటీ కాలం తర్వాత గ్యారెంటీ మొత్తం కూడా చెల్లిస్తారు.

దీనిలో కనీస హామీ మొత్తం రూ. 1.25 లక్షలు. ఆ తర్వాత సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని రూ.5000 చొప్పున పెంచుకోవచ్చు. ఈ పాలసీలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఎంపికలో పాలసీదారు మరణిస్తే హామీ మొత్తం 1.25 రెట్లు చెల్లిస్తారు, అదే రెండో ఎంపికలో 10 రెట్లు చెల్లిస్తారు. రూ. 1,000 హామీ మొత్తంపై మొదటి దానిలో రూ. 60 నుంచి రూ. 75 వరకు ఉంటుంది. రెండవ ఎంపికలో రూ. 25 నుంచి రూ. 40 మధ్య ఉంటుంది.

పాలసీ మెచ్యూరిటీ కాల వ్యవధి 10, 15, 18 సంవత్సరాలు. కనీస వయస్సు 90 రోజుల నుంచి ఎనిమిది సంవత్సరాలు. గరిష్ట పరిమితి 32 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిలో రుణ సదుపాయం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత రుణం తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మెచ్యూరిటీ తర్వాత గ్యారంటీ మొత్తాన్ని నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది ప్రాతిపదికన విడతల వారీగా తీసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed