ఇదే లాస్ట్ ఛాన్స్.. అధిక వడ్డీని ఇచ్చే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ నెలాఖరునే చివరి తేదీ..!

by Harish |   ( Updated:2023-06-14 15:28:32.0  )
ఇదే లాస్ట్ ఛాన్స్.. అధిక వడ్డీని ఇచ్చే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ నెలాఖరునే చివరి తేదీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో దేశవ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పలు బ్యాంకులు కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తు వారిని తమవైపు తిప్పుకుంటున్నాయి. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటును కాకుండా ప్రత్యేకంగా అధిక వడ్డీని అందిస్తు స్పెషల్ ఎఫ్‌డీలను పలు బ్యాంకులు తీసుకొచ్చాయి. వాటి గడువు కూడా దగ్గరకు వచ్చింది. కొన్ని బ్యాంకులు అందిస్తున్న ప్రత్యేక ఎఫ్‌డీలకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది, కాబట్టి వినియోగదారులు త్వరగా ఈ ఎఫ్‌డీ లపై దృష్టి పెట్టాలని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఆ ఎఫ్‌డీలు ఏవో ఒకసారి చూద్దాం..

SBI అమృత్ కలాష్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేకంగా ఎక్కువ వడ్డీ రేటును అందించడానికి ‘అమృత్ కలాష్’ అనే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాన్ని తెచ్చింది. ఈ పథకం స్పెషాలిటి ఏమిటంటే ఇది 400 రోజుల ప్రత్యేక FD. దీనిలో సాధారణ ప్రజలకు 7.10% వడ్డీ రేటు లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్‌లకు 7.60% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం చివరి తేదీ జూన్ 30, 2023.

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD: ఇండియన్ బ్యాంక్ "IND SUPER 400 DAYS" అనే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌ను అందిస్తుంది. దీనిలో సాధారణ ప్రజలకు 7.25% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్‌లకు 7.75% వడ్డీ రేటును అందిస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.00% వడ్డీ రేటు ఉంది. ఈ పథకం చివరి తేదీ కూడా జూన్ 30, 2023.

SBI WE కేర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్‌ల కోసం మాత్రమే ఈ పథకాన్ని తెచ్చింది. ఇది 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాల వ్యవధితో వస్తుంది. దీనిలో సీనియర్ సిటిజన్‌లకు 7.50% వడ్డీ రేటు లభిస్తుంది. దీని చివరి తేదీ జూన్ 30, 2023.

Read more: YouTube ఛానల్ యజమానులకు గుడ్‌న్యూస్.. ఇక చేతినిండా డబ్బులే డబ్బులు!

Advertisement

Next Story