Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌, జియోతో స్పేస్‌ఎక్స్ బంపర్‌ డీల్‌.. ఇండియాకు మస్క్‌ స్టార్‌లింక్ ఇంటర్నెట్‌!

by Vennela |   ( Updated:2025-03-12 07:43:47.0  )
Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌, జియోతో స్పేస్‌ఎక్స్ బంపర్‌ డీల్‌.. ఇండియాకు మస్క్‌ స్టార్‌లింక్ ఇంటర్నెట్‌!
X

దిశ, వెబ్ డెస్క్: Jio SpaceX Deal: నిన్న ఎయిర్ టెల్.. నేడు రిలయన్స్(Reliance Jio) జియో ..ఎలన్ మస్క్ స్టార్ లింక్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ లో వేగవంతమైన ఇంటర్నేట్ సేవలను అందించనున్నట్లు జియో సంస్థ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ జియో(Reliance Jio) నేడు కీలక ప్రకటన చేసింది. బిలియనీర్ ఎలన్ మస్క్ (elon )కు చెందిన స్టార్ లింక్(star link) తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. స్టార్ లింక్ కు చెందిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ సేవలను భారత కస్టమర్లకు వేగంగా అందివ్వనున్నట్లు తన ప్రకనటలో జియో పేర్కొంది. స్టార్ లింక్ సేవలను ఇండియాకు అమ్మేందుకు స్పేస్ ఎక్స్ అంగీకరించిన తర్వాత ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో(Reliance Jio) వెల్లడించింది.


జియో (Reliance Jio)ప్రత్యర్థి అయిన భారతి ఎయిర్ టెల్(airtel) కూడా స్టార్ లింక్ తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. జియో బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థతో స్టార్ లింక్ జతకానున్నట్లు తమ ప్రకటనలో జియో వెల్లడించింది. హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో(Reliance Jio) సీఈవో మాథ్యూ ఒమన్ తెలిపారు. జియో సంస్థ(Reliance Jio) తన రిటైల్ ఔట్ లెట్ల ద్వారా స్టార్ లింక్ ఎక్విప్ మెంట్ ను అందిచనున్నది. కస్టమర్ సర్వీస్ ఇన్ స్టలేషన్, యాక్టివేషన్ కూడా జియో చూసుకోనున్నది. జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ కు వేగంగా ఇంటర్నెట్ అందనున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ పేర్కొంది.


టెలికం దిగ్గజాల్లతో ఒక్కటైన భారతీ ఎయిర్ టెల్ తన కస్టమర్లకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో జతకట్టింది. దీనిపై ఇరు సంస్థలు అధికారికంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో స్టార్ లింక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి వీలుపడుతుంది. ఈ సందర్భంగా ఎయిర్ టెల్ ఎండీ గోపాల్ విఠల్ మాట్లాడారు. భారత్ లో ఎయిర్ టెల్ కస్టమర్లకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ ఎక్స్ తో పనిచేయడం ఓ మైలు రాయి వంటిది అన్నారు. కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి కట్టుబడి ఉందనడానికి ఈ ఒప్పందం నిదర్శనమన్నారు.


Read More..

Mauritius Tax Haven: అక్కడ ట్యాక్స్‌ లేనే లేదు.. అందుకే ట్యాక్స్‌ హెవన్‌ అని పిలుస్తారు.. ఆ దేశం గురించి తెలుస...

Next Story

Most Viewed