- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ITC: 40 ఏళ్లు పైబడిన వారి కోసం కొత్త న్యూట్రిషన్: ఐటీసీ
దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే 10 రోజుల్లో 40 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం 'రైట్ షిఫ్ట్' అనే కొత్త న్యూట్రిషన్ బ్రాండ్‌ను ప్రారంభించనున్నట్లు ఐటీసీ తాజాగా ప్రకటించింది. ఇది బలం, శక్తి నిర్మాణాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త న్యూట్రిషన్ బ్రాండ్‌లో వినియోగదారులకు అవసరమయ్యే పోషకాహారాన్ని అందించామని ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి తెలిపారు. దీనిని పానీయాలు, భోజనం, స్నాక్స్‌లో తీసుకోవచ్చు.ఇది ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో రూపొందించిన ప్రొప్రైటరీ ఫార్ములేషన్. కంపెనీ గత సంవత్సరంలో కూడా, దాదాపు 100 కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది, వీటిలో చాలా వరకు ఆరోగ్యం, పోషకాహారం విభాగాలను అభివృద్ధి చేయడానికి సంబంధించినవే ఉన్నాయి. ఐటీసీ 2019లో బింగో ద్వారా బేక్డ్ చిప్‌లను ప్రారంభించడంతో ఆరోగ్యకరమైన ఆహార విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి, కంపెనీ తన ఆహార బ్రాండ్లలో పలు రకాల ఉత్పత్తులను విడుదల చేయడం మొదలుపెట్టింది.