Ira Bindra: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హెచ్ఆర్ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా నియామకం..!

by Maddikunta Saikiran |
Ira Bindra: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హెచ్ఆర్ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా నియామకం..!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) గ్రూప్ హ్యూమన్ రిసోర్సెస్‌ కొత్త ప్రెసిడెంట్‌గా 47 ఏళ్ల ఇరా బింద్రా(Ira Bindra) నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించి వివరాలను అంబానీ వ్యక్తిగతంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా బింద్రా ఇదివరకు యూఎస్9US)లోని మెడ్‌ట్రానిక్(Medtronic) కంపెనీలో పని చేశారు. ఆ సంస్థలో ఆమె హెచ్ఆర్ హెడ్(Head)గా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్(VP)గా పని చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆధ్వర్యంలోని కంపెనీలకు సంబంధించి టాప్ మేనేజ్మెంట్ నియామకాలను ఈమె చూసుకోబోతున్నారు. కాగా రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యతలను చేపట్టబోతున్న తొలి కుటుంబేతరా మహిళగా బింద్రా రికార్డు సృష్టించబోతుంది . ఈమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి 1998లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అలాగే 1999లో నెదర్లాండ్స్(Nederlands)లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్(MSM) నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(MBA) పట్టా పొందారు. బింద్రా మెడ్‌ట్రానిక్ కంపెనీలో చేరక ముందు జీఈ క్యాపిటల్, జీఈ ఇండియా, జీఈ హెల్త్ కేర్, జీఈ ఆయిల్&గ్యాస్ లో పని చేశారు.

Advertisement
Next Story

Most Viewed