జాన్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు

by Harish |
జాన్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్ది కాలంగా మార్కెట్లో పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. అధిక రాబడి, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వేగంగా రెట్టింపు కావడం, పెట్టుబడి ప్రాసెస్ కూడా సులభంగా ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) జులై 9న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూన్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 17 శాతం పెరిగి రూ. 40,608.19 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు మే నెలలో ఇన్‌ఫ్లోల విలువ రూ. 34,697 కోట్లుగా ఉంది. అదే ఏప్రిల్ నెలలో రూ.18,917 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా జూన్‌లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) రూ.61.16 లక్షల కోట్లకు చేరాయని డేటా చూపించింది. అదే సమయంలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా, మేలో రూ. 42,295 కోట్ల ఇన్‌ఫ్లోతో పోలిస్తే మొత్తం అవుట్‌ఫ్లో రూ.1,07,357 కోట్లుగా ఉంది.

SIP ఇన్వెస్ట్‌మెంట్ల ప్రజలకు అవగాహన ఉండటం, పరిశ్రమల వృద్ధి, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల కంటే బాగా రాణిస్తుండటం, మార్కెట్లు ర్యాలీ చేస్తుండటం వలన లాంగ్‌టర్మ్‌‌లో అధిక రాబడి కోసం ప్రజలు ఈక్విటీ ఫండ్స్‌లోకి పెద్ద ఎత్తున నికర పెట్టుబడులు పెడుతున్నారని కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నేషనల్ హెడ్ - సేల్స్, మార్కెటింగ్ అండ్ డిజిటల్ బిజినెస్ మనీష్ మెహతా అన్నారు.

Advertisement

Next Story