ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే ఆర్‌బీఐ లక్ష్యం: Governor Shaktikanta Das

by srinivas |   ( Updated:2022-09-02 12:39:34.0  )
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే ఆర్‌బీఐ  లక్ష్యం: Governor Shaktikanta Das
X

న్యూఢిల్లీ: భారత్‌లో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, అధిక ద్రవ్యోల్బణ ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుకుందని, ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రస్తుత లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమేనని దాస్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని వీలైనంత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

క్రమంగా ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం అంతర్జాతీయ సమస్యగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను పోల్చుకుంటే భార్‌లో ఏప్రిల్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధానంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఇంకా వస్తువులు, ఆహార పదార్థాల ధరలు దిగి రావడంతో ప్రస్తుతం ద్రవ్యోల్బణం నెమ్మదిస్తోందని దాస్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం ఒత్తిడి భారత ఆర్థికవ్యవస్థపై కూడా ఉంటుందన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ అంచనా వేసిన 16.5 శాతం కంటే తక్కువేనని, దీనిపై సమీక్ష చేస్తున్నట్టు దాస్ వివరించారు. రానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో దీన్ని వివరిస్తామన్నారు. అంతేకాకుండా బ్యాంకుల రుణ వృద్ధిని పరిశీలిస్తున్నామని దాస్ చెప్పారు. ఆర్థికవ్యవస్థకు మద్దతుగా భారత్ వద్ద భారీగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇతర దేశాల కరెన్సీల కంటే రూపాయి బలంగా ఉండేందుకు ఇదే కారణమని దాస్ స్పష్టం చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలదొక్కుకునేలా బ్యాంకుల వద్ద సరిపడా మూలధన నిల్వలు ఉన్నాయని దాస్ వెల్లడించారు.

Advertisement

Next Story