ఇండిగోకు విమానాల లీజుకు అనుమతులు మంజూరు

by Harish |
ఇండిగోకు విమానాల లీజుకు అనుమతులు మంజూరు
X

ముంబై: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా యునైటెడ్ స్టేట్స్, కెనడాకు విమానాలను నడపడానికి రెండు వైడ్-బాడీ విమానాలను స్వల్ప కాలానికి(వెట్ లీజు) లీజు పొందడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందింది. దీని ద్వారా ఆపరేటింగ్ సిబ్బంది, ఇంజనీర్లతో పాటు విమానాలను ఇండిగో సంస్థ అద్దెకు తీసుకుంటుంది. మొదటిసారిగా ఇండిగో ఫిబ్రవరిలో ఢిల్లీ-ఇస్తాంబుల్ మార్గంలో బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. ఈ విమానాన్ని టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి వెట్ లీజుకు తీసుకున్నారు.

ప్రస్తుతం సంస్థ వద్ద 300 కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో 55 శాతం వాటా కలిగి ఉన్న ఇండిగో, కొత్తగా 500 కంటే ఎక్కువ ప్యాసింజర్ జెట్‌‌లను కొనుగోలు చేయడానికి బోయింగ్, ఎయిర్‌బస్ రెండింటింతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇండిగో సంస్థ 2006 లో కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 75 కంటే ఎక్కువ నగరాలకు విమానాలను నడుపుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed