Valentines Day Offer: వారికి సగం ధరకే ఇండిగో విమాన టికెట్లు.. త్వరగా బుకింగ్ చేసుకోండి!

by D.Reddy |
Valentines Day Offer: వారికి సగం ధరకే ఇండిగో విమాన టికెట్లు.. త్వరగా బుకింగ్ చేసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: మరికొన్ని గంటల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ఇప్పటికే యువత వాలంటైన్ వీక్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, మాల్స్, టూర్ ప్లానింగ్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. నాలుగు రోజుల పాటు జంటలకు సగం తగ్గింపు ధరలకే టికెట్ అందిస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రయాణికులకు అతి తక్కువ ఛార్జీలకే అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇండిగో సంస్థ.. వాలంటైన్స్ డే సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ద్వారా ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి విమాన టికెట్ల బుకింగ్స్‌పై ఏకంగా 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను అందిస్తుంది. అయితే, ఇద్దరు ప్రయాణికులకు క‌లిపి టికెట్ బుక్ చేస్తేనే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఇండిగో సంస్థ తెలిపింది. ఇక ఈ నెల 16వ తేదీ రాత్రి 11:59 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అలాగే, బుకింగ్ తేదీకి, జ‌ర్నీ డేట్‌కు మ‌ధ్య క‌నీసం 15 రోజుల వ్యవధి ఉండాల‌ని వెల్లడించింది.

టిక్కెట్ ధరలతో పాటు, ప్రయాణీకులు ప్రయాణ యాడ్-ఆన్‌లపై కూడా కస్టమర్లు తగ్గింపులను పొందవచ్చని ఇండిగో తెలిపింది. ప్రీ-బుక్ చేసుకున్న అదనపు లగేజీపై 15 శాతం తగ్గింపు, సీటు ఎంపికపై 15 శాతం తగ్గింపు, ప్రీ-ఆర్డర్ భోజనంపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌, ఇండిగో 6ఈ ఏఐ చాట్‌బాట్‌, ఎంపిక చేసిన ట్రావెల్ పార్ట్‌న‌ర్స్ వేదిక‌గా టికెట్ బుక్ చేసిన‌ప్పుడు ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంది.

వీటితో పాటు ఇండిగో ఫిబ్రవరి 14న మరో ఫ్లాష్ సేల్‌ను కూడా నిర్వహించనుంది. ఫిబ్రవరి 14న రాత్రి 8 నుంచి 11.59 గంటల వరకు ఈ ఫ్లాష్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో వెబ్‌సైట్‌/మొబైల్‌ యాప్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే తొలి 500 మందికి అదనంగా మరో 10% రాయితీ లభిస్తుంది. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ట్రిప్ ప్లాన్ చేసిన జంటలకు ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుంది. మరీ వెంటనే మీ డెస్టినేషన్‌కు టికెట్లు బుక్ చేసుకోండి.

Next Story