- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
iPhone Exports: రూ. లక్ష కోట్లు దాటిన ఐఫోన్ ఎగుమతులు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ అరుదైన రికార్డును సాధించింది. 2024లో కంపెనీకి చెందిన ఐఫోన్‌ల ఎగుమతులు ఏకంగా రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించింది. పరిశ్రమ డేటా ప్రకారం, 2024 కేలెండర్ సంవత్సరంలో యాపిల్ ఎగుమతులు 12.8 బిలియన్ డాలర్లకు(రూ.1.10 లక్షల కోట్ల) చేరుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసే నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం ఎగుమతుల్లో 42 శాతం ఐఫోన్లే కావడం విశేషం. దేశీయంగా ఉత్పత్తి కూడా దాదాపు 46 శాతం అధికంగా 17.5 బిలియన్ డాలర్లకు (రూ. 1.48 లక్షల కోట్ల) పెరిగింది. ఈ గణాంకాలు 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రాథమిక అంచనాలు మాత్రమే, ఇది ఇంకా పెరగవచ్చు. ఈ వృద్ధి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం స్థానిక తయారీని పెంచేందుకు తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ప్రభావమే. ముఖ్యంగా దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల సృష్టికి పీఎల్ఐ పథకం ఎంతో దోహదపడుతోంది. ఐఫోన్ తయారీ కాంట్రాక్టు కలిగిన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ లాంటి కంపెనీలే 1.85 లక్షల వరకు ఉపాధిని కల్పించాయి. ఈ ఉపాధిలో ముప్పావు వంతు స్త్రీలే ఉన్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పీఎల్ఐ పథకం ద్వారా 2024లో దేశీయంగా రూ. 4.10 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లు ఉత్పత్తి జరిగాయి.