Forex Reserves: సరికొత్త గరిష్ఠ స్థాయిలకు ఫారెక్స్ నిల్వలు

by S Gopi |
Forex Reserves: సరికొత్త గరిష్ఠ స్థాయిలకు ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. ఆగష్టు 30తో ముగిసిన వారానికి సంబంధించి ఫారెక్స్ నిల్వలు 2.3 బిలియన్ డాలర్లు పెరిగి 683.99 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. వీక్లీ డేటా ప్రకారం, విదేశీ కరెన్సీ ఆస్తులు 1.49 బిలియన్ డాలర్లు పెరిగి 599 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే, బంగారం నిల్వలు 862 మిలియన్ డాలర్లు పెరిగి 61.86 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం క్షీణతను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ద్వారా జోక్యం చేసుకుంటోంది. ఐఎంఎఫ్‌ వద్ద మన దేశ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 58 మిలియన్ డాలర్లు తగ్గి 4.62 బిలియన్ డాలర్లకు చేరాయి.

Advertisement

Next Story

Most Viewed