తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు!

by Harish |
తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు!
X

ముంబై: భారత ఫారెక్స్‌ నిల్వలు తగ్గుతున్నాయి. తాజాగా బంగారం నిల్వలు క్షీణించడంతో మార్చి 31తో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 329 మిలియన్ డాలర్లు తగ్గి 578.449 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. అయితే, గత వారాలుగా ఫారెక్స్ నిల్వలు ఓ మోస్తరుగా పెరిగాయి. అంతకుముందు వారం 5.977 బిలియన్ డాలర్లు పెరిగి 578.778 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల మధ్య ఏర్పడిన ఒత్తిళ్లతో రూపాయి మారకాన్ని బలపరిచేందుకు ఆర్‌బీఐ డాలర్లను విక్రయిస్తుండడంతో ఫారెక్స్‌ నిల్వలు తగ్గుతున్నాయి.

2021, అక్టోబర్‌లో దేశంలో ఫారెక్స్‌ నిల్వలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో మన దగ్గర 645 బిలియన్‌ డాలర్ల మేర నిల్వలు ఉన్నాయి. మరోవైపు దేశీయంగా బంగారం నిల్వలు కూడా క్షీణిస్తున్నాయి. గడిచిన వారంలో 279 మిలియన్ డాలర్లు తగ్గిన బంగారం నిల్వలు 45.20 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed