Indian railways: దివ్యాంగులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్...ఇలా ఆన్ లైన్ లో వెంటనే అప్లయ్ చేసుకోండి

by Vennela |
Indian railways: దివ్యాంగులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్...ఇలా ఆన్ లైన్ లో వెంటనే అప్లయ్ చేసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్ : Indian railways: ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే బాగుండేది. చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పటికైనా ఇది ఈ నిర్ణయం తీసుకోవడం మంచి అంశంగా చెప్పవచ్చు. ఇక దివ్యాంగులకు ఈ కష్టాలు తొలగినట్లే. వాళ్లు ఏం చేయాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దివ్యాంగుల కష్టాలు ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేము. వాటిని అర్థం చేసుకునే మనస్తత్వం మనకు ఉండాలి. వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆలోచిస్తే..వాళ్లకు ఎలాంటి మేలు చేయాలో మనకు అర్థం అవుతుంది. భారతీయ రైల్వే ఆ దిశగానే ఆలోచించింది. వాళ్లకు ఉపశమనం కలిగించేలా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దివ్యాంగులు తమ రైల్వే పాసుల కోసం రైల్వేస్టేషన్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్ లైన్ లోనే తీసుకోవచ్చు. ఎలాగో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దివ్యాంగులు తమ స్మార్ట్ మొబైల్ ద్వారా పాస్ ను పొందవచ్చు. లేదంటే ఇంట్లోనే కంప్యూటర్ ద్వారా పొందవచ్చు. లేదంటే తమకు దగ్గరోని ఇంటర్నెట్ కేఫ్ కు వెళ్లాలి. అక్కడ అధికారిక లింక్ అధికారిక లింక్ http:///divyangjanid.indianrail.gov.inను ఓపెన్ చేసుకోవాలి.

ఇదే కొత్త వెబ్ సైట్ ఈ సైట్ లోనే యూనిక్ డిజబులిటీ ఐడీ కార్డు ప్రింట్ తీసుకోవాలి. అలాగే కొత్త పాస్ లు కూడా పొందవచ్చు. లేదంటే పాత పాసులకు రెన్యువల్ కూడా చేయించుకోవచ్చు. ఆ తర్వాత జనరేట్ అయ్యే పాసును ప్రింట్ తీసుకోవచ్చు.

మొబైల్ ద్వారా పాస్ ప్రింట్ తీసుకోవాలంటే ప్రింటర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేట్ కేప్ కు వెళ్లి మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని పాస్ ను చూపిస్తే నెట్ సెంటర్ వాళ్లు ప్రింట్ తీసి ఇస్తారు. అలా కూడా పని పూర్తి చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లో పాల్ ఎలా పొందాలో ఈ లింక్(https://divyangjanid.indianrail.gov.in/assets/DivyangjanManual.pdf) ద్వారా తీసుకోవచ్చు.

ఈ వెబ్ సైట్లో ముందుగా కొత్త యూజర్ క్లిక్ చేయాలి. తర్వాత పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, రాష్ట్రం, ఈమెయిల్ ఐడీ, వైకల్యం వంటి వివరాలు ఇవ్వాలి. ఓటీపీ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. ఈ ప్రక్రియ అంతా కూడా 10 నిమిషాల్లోనే ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ ఫుల్ అని వస్తే అది అయిపోయినట్లే.

రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత పాస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పాస్ మాత్రమే కాదు..ఈ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ పావు గంటలోనే ఇదంతా అయిపోతుంది. నెక్ట్స్ టైమ్ ఈ సైట్ ఓపెన్ చేసినప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. డైరెక్టుగా లాగి కావచ్చు. ఇలా ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వొచ్చు.



Next Story

Most Viewed