- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2027 నాటికి దేశీయ కంపెనీల డిజిటల్ ఆదాయం 49 శాతం!
న్యూఢిల్లీ: దేశీయ కంపెనీలు 2027 నాటికి డిజిటల్ ఇన్‌ఫ్రా ద్వారా 49 శాతం ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలున్నాయని ఓ నివేదిక తెలిపింది. రానున్న రోజుల్లో కంపెనీలు డిజిటల్ రూపంలో అందించే ఉత్పత్తులు, సేవలు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా గణనీయమైన రాబడిని సాధించే అవకాశాలున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ లెనొవొ, చెప్‌మేకర్ ఏఎండీ సంయుక్తంగా రూపొందించ నివేదిక ప్రకారం.. 97 శాతం దేశీయ వ్యాపారాలు తమ కార్యకలాపాల్లో డిజిటలీకరణను వినియోగిస్తున్నాయి, లేదా ఉపయోగించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి. అందులో ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్ అగ్రగామిగా ఉంది.
డిజిటల్ సామర్థ్యం పెరగడం, వ్యాపారాలు సమర్థవంతంగా కొనసాగేందుకు డేటా-ఆధారిత వినియోగాన్ని పెంచుతున్నాయి. దీని ద్వారా క్లౌడ్, ఎడ్జ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వాడకం వేగవంతంగా జరుగుతోందని లెనొవొ ఇండియా ఎండీ అమిత్ లూత్రా అన్నారు. దాదాపు 85 శాతం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని సంస్థలు తమ వ్యాపార లక్ష్యాలను సాధించేందుకు డిజిటల్ మౌలిక సదుపాయాలు అవసరమని భావిస్తున్నాయి. వారు 2023లో డిజిటలీకరణకు మారేందుకు, ఐటీ మౌలిక సదుపాయాలు ఆధునీకరించేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఎక్కువ పెట్టుబడులు పెట్టనున్నారని నివేదిక పేర్కొంది.