2047 నాటికి 47 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

by Harish |
2047 నాటికి 47 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
X

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 47 ట్రిలియన్ డాలర్లకు చేరుకోడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. ముంబైలో జరిగినటువంటి 'ఇండియా కాలింగ్ కాన్ఫరెన్స్ 2023' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థను రాబోయే రోజుల్లో మరింత గొప్పగా మార్చడానికి పోటీతత్వం చాలా అవసరం అని అన్నారు. అలాగే ముంబై గురించి మాట్లాడుతూ.. ఇది ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, భారతదేశ ఆహ్లాదకరమైన రాజధాని అని అన్నారు.



ప్రపంచ దేశాల గురించి వ్యాఖ్యానిస్తూ.. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు జరగడం వల్ల విదేశీ సంబంధాలు మెరగవుతున్నాయి. భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ దృష్టిని ప్రతిబింబిస్తుంది. అన్ని దేశాలు భారత్ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి. అలాగే, కరోనా మహమ్మారి సమయంలో ‘వ్యాక్సిన్ మైత్రీ’ క్రింద పేద దేశాలకు 278 మిలియన్ వ్యాక్సిన్‌లను ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed