151 శాతం పెరిగిన స్మార్ట్ వాచ్ అమ్మకాలు!

by Harish |
151 శాతం పెరిగిన స్మార్ట్ వాచ్ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వేరబుల్ ఉత్పత్తుల మార్కెట్ గతేడాది ఏకంగా 46.9 శాతం వృద్ధిని సాధించింది. 2022 పరిశ్రమ సరఫరా తొలిసారిగా 100 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.865 కోట్ల)కు చేరుకుంది. ప్రధానంగా స్మార్ట్ వాచ్ విభాగం అమ్మకాలు అత్యధికంగా 151.3 శాతం పెరిగాయి. మార్కెట్ పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఇండియా నెలవారీ గణాంకాల ప్రకారం, 2022, నాలుగో త్రైమాసికంలో పరిశ్రమ మొత్తం 2.52 కోట్ల యూనిట్లను సరఫరా చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16.5 శాతం అధికం.

త్రైమాసిక పరంగా స్మార్ట్ వాచ్ అమ్మకాలు 73.6 శాతం పెరిగాయి. ఇయర్ ఫోన్స్ వంటి విభాగం స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా గతేడాది ద్వితీయార్థంలో పండుగ సీజన్ కారణంగా పలు బ్రాండ్లు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేశాయి. దానివల్ల ఒక ఏడాదిలో జరిగే సరఫరాలో 60 శాతం జులై నుంచి డిసెంబర్ మధ్య మాత్రమే వేరబుల్ ఉత్పత్తుల సరఫరా జరిగిందని నివేదిక తెలిపింది.

Advertisement

Next Story