- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ పండుగ సీజన్‌లో దుమ్మురేపనున్న ఆన్‌లైన్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. వచ్చే వారం వినాయక చవితి నుంచి 40 రోజులకు పైగా ఉండే ఈ సీజన్‌లో అమ్మకాల కోసం ఇప్పటికే వ్యాపారులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. తాజాగా రానున్న పండుగ సీజన్‌కు ఆన్‌లైన్ అమ్మకాలపై మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనాలను విడుదల చేసింది.
పండుగ సీజన్ సమయంలో సుమారు రూ.90 వేల కోట్ల ఆన్‌లైన్ విక్రయాలు జరుగుతాయని వెల్లడించింది. ఇది గత ఏడాది 20 శాతం వృద్ధి నమోదవుతుందని తెలిపింది. కనీసం 14 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చని, వీరంతా ఒక్కసారైనా ఆన్‌లైన్ లావాదేవీ నిర్వహించనున్నట్టు రెడ్‌సీర్ వెల్లడించింది.
గడిచిన మూడేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా నెమ్మదించిన అమ్మకాలు ఈసారి షాపింగ్ సెంటిమెంట్‌ను పెంచే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల లాభాలు, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్ ఆదాయాలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నమోదవ్వొచ్చు. పండుగ సీజన్ ఈ-కామర్స్ విక్రయాలు దేశంలో పదేళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ దశాబ్ద కాలంలో స్థూలంగా సరుకుల విక్రయాల విలువ 20 శాతం పెరగ్గా, షాపింగ్ చేసే వారి సంఖ్య 15 శాతం పెరిగింది.
2014లో ఈ-కామర్స్ స్థూల సరుకుల అమ్మకాల విలువ రూ. 27 వేల కోట్లు ఉండగా, ఈ ఏడాది అది రూ. 5.25 లక్షల కోట్లకు చేరవచ్చని రెడ్‌సీర్ పేర్కొంది. ఈసారి అత్యధికంగా ఫ్యాషన్, పర్సనల్ కేర్, గృహోపకరణాల అమ్మకాలు ఎక్కువగా ఉండోచ్చని, గత కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడించింది.