- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Wealth Hub: అత్యధిక సంపన్నుల జాబితాలో భారత్ నాలుగో స్థానం

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ప్రతి ఏటా సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ నివేదిక ప్రకారం, భారత్ ప్రస్తుతం 85,698 మంది హై నెట్-వర్త్ ఉన్న వ్యక్తులతో నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్ దేశాలు ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్ నివేదిక కనీసం రూ. 87 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారిని హై నెట్-వర్త్ ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తుంది. వీరు ప్రపంచవ్యాప్తంగా 2024లో 4.4 శాతం పెరిగి 23 లక్షలకు చేరారు. ఇదే సమయంలో రూ. 870 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆల్ట్రా హై నెట్-వర్త్ ఉన్న వ్యక్తుల సంఖ్య తొలిసారిగా 1,00,000 దాటిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా సంపద పెరుగుదలను సూచిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. భారత్‌కు సంబంధించి ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బిలీయనీర్లు వేగంగా పెరుగుతున్నారు. గత సంవత్సరంలోనే దేశీయంగా బిలీయనీర్ల సంఖ్య 12 శాతం పెరిగి 191కి చేరుకుంది. ముఖ్యంగా గతేడాది కొత్తగా 26 మంది బిలియనీర్ల జాబితాలో చేరడం గమనార్హం. ఫలితంగా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యాలతో సమానంగా భారత్ సంపన్నుల సంఖ్యను కలిగి ఉంది. ప్రధానంగా భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరిగేందుకు స్టార్టప్‌లు దోహదపడుతున్నాయి. డిజిటల్ వినియోగం కారణంగా టెక్-ఆధారిత వ్యాపారాల పెరుగుదల సంపద సృష్టికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎంటర్‌ప్రెన్యూర్ల కారణంగా కొత్త సంపద పోగవుతోంది. వీరంతా దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా తమ వ్యాపారాలను విస్తరిస్తుండటంతో సంపన్నుల సంఖ్య పెరుగుతోందని నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది.