ఆదాయపు పన్ను ఆఫ్‌లైన్ రిటర్న్ ఫారంలను విడుదల చేసిన CBDT!

by Harish |
ఆదాయపు పన్ను ఆఫ్‌లైన్ రిటర్న్ ఫారంలను విడుదల చేసిన CBDT!
X

న్యూఢిల్లీ: 2023-24 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించి కొత్త ఆదాయ పన్ను రిట‌ర్ను ఫారంల‌ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేష‌న్‌(CBDT) నోటిఫై చేసింది. ఐటీఆర్-1, ఐటీఆర్‌-4 ఆఫ్‌లైన్ కొత్త‌ ఫారంల‌ను బుధవారం విడుదల చేసింది. ఆన్‌లైన్ ఫారంలను ఇంకా విడుదల చేయలేదు. అధిక సంఖ్య‌లో ఉన్న పెద్ద‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌న్ను చెల్లింపుదారుల‌ కోసం ఐటీఆర్ -1 ఫారం ఉప‌యోగ‌ప‌డుతుంది.

జీతం, ఒక ఇంటి ఆస్తి లేదా వ‌డ్డీ మొద‌లైన ఇత‌ర వ‌న‌రుల నుంచి ఆదాయం పొందుతూ, రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వ్య‌క్తులు ఐటీఆర్-1ను దాఖ‌లు చేయవచ్చు. ఐటీఆర్-4ను వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), వ్యాపారాల నుంచి ఆదాయం ఆర్జించే సంస్థలు దాఖలు చేయవచ్చు.

ఆఫ్‌లైన్ ఐటీఆర్ ఫారం-1, ఫారం-4లను పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకుని, వాటిని మాన్యూవల్‌గా పూరించి, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. లేదంటే ఆదాయం, డిడక్షన్ వివరాలను పూరించి, ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా ఈ ఫారంలను సమర్పించవచ్చు.

Advertisement

Next Story