భారత జీడీపీ వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్!

by Harish |   ( Updated:2023-10-10 10:17:09.0  )
భారత జీడీపీ వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) సవరించింది. ఇదివరకు అంచనా వేసిన 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెంచింది. మంగళవారం అక్టోబర్ నెలకు సంబంధించి విడుదల చేసిన ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో, భారత రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.5 శాతానికి పెరుగుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో 4.6 శాతానికి నెమ్మదించవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాదిలోనూ 6.3 శాతం వద్దే కొనసాగవచ్చు. ఏప్రిల్-జూన్ సమయంలో అంచనా వేసిన దానికంటే దేశవ్యాప్తంగా వినియోగం బలంగా ఉందని, కాబట్టి వృద్ధి స్థిరంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ 2023-24కి భారత జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఐఎంఎఫ్ సైతం ఇంచుమించు అదే స్థాయిలో అంచనాలను వెల్లడించింది. మరోవైపు 2023లో ప్రపంచ వృద్ధి 3 శాతం వద్దే కొనసాగుతుందని, 2024లో అత్యల్పంగా 2.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.

Advertisement

Next Story