- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణ రేట్లు పెంచిన ICICI బ్యాంక్!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మరోసారి తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులకు గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై ఈఎంఐ భారం మరింత పెరగనుంది. పెంచిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచే అమలవుతాయని, అదేవిధంగా అన్ని రుణాలకు వర్తిస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు తన ఎంసీఎల్ఆర్ రేటును గత నాలుగు నెలల్లో నాలుగోసారి పెంచింది. ఇదివరకు జూన్, జూలై, ఆగష్టులలో సవరించింది. ఆగష్టులో రుణాలపై 15 బేసిస్ పాయింట్లు పెంపు నిర్ణయం తీసుకుంది.
బ్యాంకు సవరించిన రేట్ల ప్రకారం, ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి, మూడు నెలలకు 7.80 శాతానికి, ఆరు నెలల కాలవ్యవధికి చెందిన ఎంసీఎల్ఆర్ రేటును 7.95 శాతానికి పెంచింది. ప్రధానంగా వినియోగదారుల రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ రేటును 8.80 శాతానికి సవరించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఇటీవల కీలక రెపో రేటును వరుస సమావేశాల్లో పెంచింది. ఈ క్రమంలోనే బ్యాంకులు సైతం ఆర్‌బీఐకి అనుగుణంగా వివిధ రుణాలపై, డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.