- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్థానిక తయారీ కోసం గూగుల్‌తో హెచ్‌పీ ఇండియా భాగస్వామ్యం!
చెన్నై: పర్సనల్ కంప్యూటర్ల దిగ్గజ సంస్థ హెచ్‌పీ భారత్‌లో ల్యాప్‌టాప్‌లను తయారు చేసేందుకు గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్టు ప్రకటించింది. గూగుల్ క్రోమ్‌బుక్ ఓఎస్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం దేశీయంగా హెచ్‌పీ పోర్ట్‌ఫోలియోలో తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హెచ్‌పీ ఇండియా స్థానిక తయారీని వేగవంతం చేయాలని భావిస్తోంది. దేశంలో డిజిటల్ విద్య ఊపందుకుంటోంది. చాలా ప్రభుత్వ పాఠశాలలు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి స్థానిక్ తయారీని చేపట్టడం ద్వారా ఆర్డర్ బుక్ మరింత పెంచుకోవచ్చని హెచ్‌పీ అంచనా వేస్తోంది. సాధారణంగానే క్రోమ్‌బుక్ సరసమైన బడ్జెట్‌లో లభిస్తాయి. స్థానిక తయారీ ద్వారా దీన్ని మరింత బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకురావడం కలిసొస్తుందని హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ పేర్కొన్నారు.