- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్తంగా సగటున 7 శాతం పెరిగిన ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ముడిసరుకులు, కార్మికుల ఖర్చులు అధికం కావడం, కొవిడ్ తర్వాత ఇళ్ల కొనుగోళ్లకు ఊపందుకున్న డిమాండ్, ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ సబ్సిడీ పథకాలను నిలిపేయడం వంటి కారణాలతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రధాన మార్కెట్లలోని ఇళ్ల ధరలు సగటున 7 శాతం పెరిగాయని ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది.
అత్యధికంగా బెంగళూరులో ప్రాపర్టీల సగటు ధర పెరుగుదల గతేడాది కంటే 10 శాతం పెరిగిందని, దీని తర్వాత పూణెలో 8 శాతం, అహ్మదాబాద్‌లో 7 శాతం పెరిగాయి. 'ఇప్పటికీ స్థిరాస్తి రంగం దీర్ఘకాలిక అత్యుత్తమ రాబడిని అందించే పెట్టుబడి సాధనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, పెట్టుబడిదారులు, సొంత ఇళ్లను కొనేవారు మంచి సమయంగా భావించడం వల్లే ధరలు పుంజుకుంటున్నాయని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్ఓ వికాస్ వాధవన్ చెప్పారు.
తాజాగా ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపు విషయంలో విరామం తీసుకున్నప్పటికీ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే ఉంది. తదుపరి సమావేశంలో ఆర్‌బీఐ మళ్లీ వడ్డీ రేట్లు పెంచవచ్చు. దానివల్ల పెరిగే రుణ ఖర్చుల కారణంగా వినియోగదారులకు గృహ రుణాలు మరింత భారం కానున్నాయి. ఏడాది ప్రాతిపదికన మిగిలిన ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతాల్లో సగటున 6 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.