ఎంసీఎల్ఆర్ రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

by S Gopi |
ఎంసీఎల్ఆర్ రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన కాలవ్యవధులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. మార్చి 7 నుంచే అమల్లోకి వచ్చే ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. సవరించిన తర్వాత ఎంసీఎల్ఆర్ 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. ఎంసీఎల్ఆర్ పెంచిన వాటిలో ఓవర్‌నైట్ కాలవ్యవధిపై 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెంచగా, మూడు నెలల కాలవ్యవధి ఎంసీఎల్ఆర్‌ను 9.10 శాతం నుంచి 9.15 శాతానికి సవరించింది. నిర్దిష్ట రుణానికి బ్యాంకు విధించే కనీస వడ్డీ రేటును ఎంసీల్ఆర్‌గా పరిగణిస్తారు. సాధారణంగా ఎంసీఎల్ఆర్ రేటు కంటే తక్కువకు బ్యాంకు రుణాలను ఇవ్వదు. కాబట్టి వినియోగదారులు తీసుకునే రుణాలు ఎంసీఎల్ఆర్ రేటు ఆధారంగా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed