HDFC Bank: మరింత భారం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు!

by Vinod kumar |
HDFC Bank: మరింత భారం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు!
X

ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం తర్వాత మొదటిసారి రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎంపిక కాలవ్యవధులపై ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ల బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్(ఎంసీఎల్ఆర్) రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు తెలిపింది. పెంచిన రేట్లు సోమవారం(ఆగష్టు 7) నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 శాతం పెంచి 8.35 శాతానికి, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు పెంచి 8.45 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.6 శాతం నుంచి 8.7 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.9 శాతం నుంచి 8.95 శాతానికి చేరింది.

ఏడాది కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటును 9.05 శాతం నుంచి 9.1 శాతానికి, రెండేళ్ల ఎంసీఈల్ఆర్ రేటును 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచుతూ బ్యాంకు నిర్ణయించింది. ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక‌ రుణ రేటు. నిధుల సేక‌ర‌ణ‌కు బ్యాంకుల‌కు అయ్యే (మార్జిన‌ల్) ఖర్చు, నిర్వ‌హ‌ణ వ్య‌యం, క్యాష్ రిజ‌ర్వ్ రేషియో (సీఆర్ఆర్‌), కాల‌ప‌రిమితి ప్రీమియంల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. కాబ‌ట్టి, బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే త‌క్కువ‌కు రుణం అందించే అవ‌కాశం ఉండ‌దు. కాబట్టి ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.

Advertisement

Next Story

Most Viewed