IMC: ప్రభుత్వం పాలసీ విధానాల కొనసాగింపు, పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి: ఐఎంసీ చీఫ్

by S Gopi |
IMC: ప్రభుత్వం పాలసీ విధానాల కొనసాగింపు, పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి: ఐఎంసీ చీఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల నుంచి అభ్యర్థనలు పెరిగాయి. ఈ సందర్భంగా ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఐఎంసీ) సైతం ఆర్థిక మంత్రికి కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం తన పాలసీ విధానాలను కొనసాగించాలని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని సూచించింది. ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్‌ని కొనసాగించడం ముఖ్యం. తరచూ సంస్కరణల్లో మార్పులు దీర్ఘకాలిక ప్రణాళికకు విఘాతం కలిగిస్తాయని ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్, ఓమ్నియాక్టివ్ హెల్త్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ మరివాలా అభిప్రాయపడ్డారు. స్థిరమైన నిర్ణయాల ద్వారా ప్రపంచ వాణిజ్యంతో సంబంధాలను కొనసాగించవచ్చు. వీటితో పాటు మరికొద్ది రోజుల్లో ప్రకటించబోయే కేంద్ర బడ్జెట్‌లో అంతర్గత పాలనను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని, వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడం, అనవసరమైన పథకాలను తొలగించడం, అవసరమైన చోట మార్పులతో ఉండాలని ఆయన తెలిపారు. దీనివలన వ్యాపారానుకూల వాతావరణ ఏర్పడుతుంది. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడం సాధ్యమవుతుంది. తయారీ రంగ ప్రోత్సాహానికి పీఎల్ఐ పథకం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని, వ్యవసాయ రంగానికి అనువైన గిడ్డంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాలని, దానివల్ల పంట సాగు తర్వాత నష్టాలను తగ్గించడం, సరఫరాను మెరుగుపరుస్తాయని సజయ మరివాలా వివరించారు.

Next Story

Most Viewed