ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ పెంపు.. టన్నుకు రూ.7వేలు

by Hajipasha |
ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ పెంపు.. టన్నుకు రూ.7వేలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ పన్నును ఒక టన్ను దేశీయ ముడి చమురుపై ప్రస్తుతమున్న రూ.6వేల నుంచి రూ.7వేలకు పెంచారు. పన్ను ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) రూపంలో విండ్ ఫాల్ పన్నును వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కొత్త విండ్‌ఫాల్ ట్యాక్స్ జులై 16 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇక డీజిల్, పెట్రోల్, జెట్ ఇంధనం, విమాన ఇంధనం ఎగుమతులపై ప్రస్తుతానికి ఎలాంటి ఎస్‌ఏఈడీ కూడా విధించడం లేదు.

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని 2022 జులై 1న తీసుకొచ్చింది. అప్పట్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో కొన్ని దేశీయ చమురు ఉత్పత్తి సంస్థలు ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తి చేసి, వాటిని మన దేశంలోనే విక్రయించకుండా విదేశాలకు ఎగుమతి చేసి భారీగా లాభాలను గడించారు. ఈ క్రమంలోనే వాటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర సర్కారు విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed